జాతీయ రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీకి వచ్చారా? నేషనల్ ఫ్రంటా.. నేషనల్ పార్టీనా అన్నది తేల్చుకున్నారా?దేశ్ కీ నేత కావాలనుకుంటున్న గులాబీ బాస్ అడుగులు ఏవైపు పడుతున్నాయి? ఇప్పుడివే ప్రశ్నలు టీఆర్ఎస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని.. అయితే అది ఏ రూపంలో ఉంటుందో చెప్పలేనంటూ మొన్నటిదాకా దాటవేసేవారు కేసీఆర్. అవసరమైతే జాతీయ పార్టీ పెడతానే మాటను మాత్రం తరచూ వల్లెవేసేవారు. ఇప్పుడా విషయంపై ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్టుగా తెలుస్తోంది. జాతీయ పార్టీ పెట్టేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ గట్టిగా అనుకున్నారు. అందుకోసం పలు ప్రాంతీయ పార్టీలను కలిశారు. మద్దతు కోరారు. తొలుత కేసీఆర్ తో నడిచేందుకు ఆయా పార్టీలు ముందుకొచ్చినా.. ఆ తర్వాత మనసు మార్చుకున్నాయి. బీజేపీపై వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాయి. దాన్ని బలపరుస్తూ…ఇటీవల బీబేపీ ప్రభుత్వానికి విపక్షాలు ఉమ్మడి రాసిన రాసిన లేఖలో కాంగ్రెస్ సంతకాన్ని కూడా తీసుకున్నాయి. ప్రాంతీయ పార్టీలను నమ్ముకుని రాజకీయం చేస్తే తన లక్ష్యం నెరవేరదేమోనని భావిస్తున్న కేసీఆర్.. జాతీయ కొత్త పార్టీ పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.