తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీదే హవా. డజను మంది ఆ కుటుంబ నేపథ్యం ఉన్న వారే హీరోలుగా కొనసాగుతున్నారు. వారంతా మోగాస్టార్ చిరంజీవి చూపిన దారిలో నడిచిన వారే. ఆయన ఫ్యాన్స్‌ అభిమానంతోనే పెద్ద హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే ఎవరైనా, ఏ ఫీల్డ్‌లోనైనా, ఆఖరికి ఇంట్లో అయినా.. తన కాళ్ల మీద తాము నిలబడ్డ తర్వాత దారి చూసుకోవాల్సిందే కదా. అందుకే ఓ హీరో బయటికి రావాలనుకుంటున్నారు. అంటే మెగా కాంపౌడ్ ముద్ర నుంచి వచ్చేసి…సొంత ఇమేజ్‌తో మాత్రమే ఉండాలనుకుంటున్నారని టాక్. మెగా స్టార్ తర్వాత అంత పేరున్న వ్యక్తి పవన్ కల్యాణ్, ఆ తర్వాతే మిగతా హీరోలు. అయితే తాజాగా అల్లు అర్జున్ చేస్తున్న కామెంట్స్, తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు అన్ని మెగా ముద్ర నుంచి బయటపడే ప్రయత్నమేనంటున్నారు సినీ క్రిటిక్స్.

అల్లు అర్జున్ కొన్ని రోజులుగా మెగా కుటుంబానికి సినిమాల పరంగా దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన సినిమా పుష్ప ఈవెంట్‌ కోసం మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరూ హాజరవకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అల్లు, కొణిదేల వారి ఇళ్ల నుంచి ఎవరి సినిమాలు రిలీజైనా ఎవరో ఒకరు ఆ రెండు కుటుంబాల నుంచి హాజరవుతారు. కానీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి కుటుంబం నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు. దీనికి కారణాలు ఏంటా…అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ రోజునే పవన్ మంగళగిరిలో ఉక్కు దీక్షలో కూర్చున్నారు. పవన్‌ను పిలిచినా వస్తారో రారో అనే విషయం పక్కన పెడితే ఆయన దీక్ష రోజే…పుష్ప ఈవెంట్ ప్లాన్ ప్రకారం జరిగిందా లేదా అనే ప్రశ్న తొలిచివేస్తోంది. పవన్ ఈ దీక్షకు సంబంధించి పుష్ప ఈవెంట్‌ అనౌన్స్ చేసే కంటే ముందే ప్రకటించారు. అయినా కూడా పుష్ప ఫంక్షన్ ఆరోజు పెట్టడానికి కారణాలపై చర్చ జరుగుతోంది. ఇందుకు గంతలో జరిగిన గొడవ కూడా కారణం కావొచ్చు. ఓ ఆడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్ పవన్ పేరు పలకడంపై అభ్యంతరం తెలపడం ఎఫెక్ట్ చూపించినట్టైంది.
ఇదొక్కటే కాదు అల్లు అర్జున్ తాజాగా చేసిన వ్యాఖ్యల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. నాకూ ఒక ఆర్మీ ఉంది. ఇక తగ్గేదే లే. నా అభిమానులే నా ఆర్మీ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ దేనికి సంకేతమో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

అల్లు వారి అబ్బాయిగా ఐకాన్ స్టార్‌కు పేరుంది. సౌతిండియాలో పెద్ద హీరోగా ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ…తనను తాను మలుచుకోని సూపర్‌ స్టార్‌గా నిలిచారు. ఈ మధ్య కాలంలో ఆయన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ విపరీతంగ పెరిగిపోయింది. ఇక పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నారు. అయితే ఇప్పడు కావాల్సింది అంతకు మించి. అందుకేనేమో తాను మరింత ప్లాన్డ్‌గా వెళుతున్నట్టు కనిపిస్తోంది. మెగా కుటుంబ నటుల సినిమాలకే కాకుండా ఇతర హీరోల మూవీ ఈవెంట్లకు హాజరవుతున్నారు బన్నీ. ఇక పుష్ప ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ సినిమాపై కామెంట్స్‌పై హాట్‌ టాపిక్‌గా మారాయి. తమ్ముడు చరణ్ అన్న మాటల వెనక అర్థం ఏంటో తెలియడం లేదంటున్నారు. మొత్తానికి బన్నీ తన ఫ్యూచర్‌ ప్లాన్‌ పకడ్భందీగా చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మెగా కాంపౌండ్ అనే పేరు నుంచి బయటికి వచ్చేసి పూర్తిగా అల్లు వారి అబ్బాయి, ఐకాన్ స్టార్‌గా ఉండాలని పరితపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. మరి బన్నీ వేస్తున్న అడుగులకు మెగా ఫ్యామిలీ ఎలా రియాక్టవుతారో చూడాలి.