తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా అత్యధికంగా పోలీస్ శాఖలో ఉద్యోగ ఖాళీలు(tspsc) ఉండటంతో…పోలీస్ జాబ్ కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అయితే నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత మరి జాబ్ కొట్టగలమా? పోటీ పరీక్షకు కావాల్సిన విధంగా సిద్ధం కాగలమా? పరీక్షకు రెడీ కావాలంటే ఏం చేయాలి. ఎలా చదవాలనే టెన్షన్ ఉంటుంది. ఈ ఆందోళన దూరం చేసి…మంచి గైడెన్స్ ఇస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు పోలీస్ శాఖ తమ వంతు సాయం చేస్తోంది. హైదరాబాద్‌లోని సైబ‌రాబాద్ క‌మీష్ న‌రేట్ ప‌రిధిలోని శంషాబాద్(rgia) ఎయిర్ పోర్ట్ రోడ్డులోని SSక‌న్వెష‌న్‌లో మెగా ఫ్రీ రిక్యూట్‌మెంట్‌ ట్రైనింగ్ ప్రారంభించారు సైబ‌రాబాద్ పోలీసులు. పీకే.. ఈ పాలాభిషేకాలు నీకే!?

అభ్యర్థులు లక్ష్య సాధన కోసం చదివితే… ఖ‌చ్చితంగా మంచి ఫ‌లితాల్ని చూస్తార‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఎగ్జామ్ ఎలా ఉండనుందని గ‌మ‌నించాలని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాల‌ని సూచించారు cyberabad cp సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌. 10 రోజుల వ‌ర‌కు సిల‌బ‌స్ స్టార్ట్ చేయ‌కుండా ముందుగా పాత ప్రశ్నప‌త్రాల‌ను రివైజ్ చేయ‌డం మంచిదన్నారు.. త‌ల్లిదండ్రులు కూడా పిల్లలను ఒత్తిడికి గురి చేయకుండా ఉండాల‌ని కోరారు. విజయం సాధించాలంటే స‌ర‌దాలు, సినిమాలు, షికార్లు, సోష‌ల్ మిడియా వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. 

పంట కోసం తంటా.. ఎలుగుబంటితో కాపలా