ఆర్కె రోజా సెల్వమని రెడ్డి…ఇలా పూర్తి పేరుతో చెప్తే ఎవరో అనుకోవచ్చు..! జబర్దస్త్ జడ్జ్ రోజా అంటే టక్కున అర్ర రే…గుర్తొచ్చింది అంటారు…కదా…
వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆర్కె రోజా రెడ్డి…ఇక మంత్రి రోజా అయ్యారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆమె అనుకున్నది సాధించారు. ఆర్కె రోజా అను నేను…అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక ఎమ్మెల్యే గా ఇన్నాళ్లు నియోజక వర్గానికి పరిమిత మైన ఆమె ఇక…రాష్ట్రంలో ప్రజలకు అందే సేవల పై సమీక్షలు, పథకాల అమలు చేయనున్నారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యే లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా….ఇప్పుడు మరింత దూకుడుగా…వ్యవహరించనున్నారు.
ఒక హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రయాణం విజయవంతం. భార్యగా, తల్లిగా ఉంటూనే ఎమ్మెల్యేగా ఆమెకు ఆమె సాటి.
రాజకీయ అరంగేట్రం లో ఎన్నో అవమానాలు…అన్నింటినీ తట్టుకొని.. నిబడ్డారు రోజా.
టీడీపీలో నుంచి మొదటి సరి పోటీ చేసి..ఓడినా….ఆమె ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తనను ఐరన్ లెగ్ అంటూ…అవమానించిన కుంగిపోలేదు. రాజకీయ రణ రంగంలో రాటుదేలారు. వైసీపీలోకి వచ్చి…ఎమ్మెల్యే గా గెలిచి చూపించి…apiic చైర్మన్ పదవి చేపట్టారు. ఆ తర్వాత పదవి నుంచి తప్పుకున్నా… ఇప్పుడు మంత్రిగా ..కొత్త బాధ్యతలకు రెడీ అయ్యారు. ఇక మంత్రిగా ఆమె ఎలా ముందుకు వెళతారో చూడాలి… ఆల్ ది బెస్ట్.