జ్ఞాపకం మనిషి మస్థిష్కంలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక దృశ్యాన్ని చూసిన మనిషి..దాన్ని ఎన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాడనేది…చెప్పలేని అంశం. అది ఆ మనిషి మేధస్సుపై ఆధారపడి ఉంటుంది. దానికి అంతం అనేది ఆ మనిషి మరణంతోనే. అయితే మరణించిన మనిషి మళ్లీ పుడితే? గత జన్మలో తన మస్థిష్కంలో ఉన్న జ్ఞాపకాలు ఒకానొక సమయంలో గుర్తుకువస్తాయా? అన్నది మాత్రం ఒక ప్రశ్న అనే చెప్పాలి. ఆనాటి కాలంలోని పరిస్థితులు జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తుకు రావడమనేది అప్పటి పరిస్థితులను ప్రస్తుతానికి ముడిపడటమనే కథాంశమే శామ్ సింగారాయ్ సినిమా.

డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యాన్…తన రెండో సినిమాలో కూడా ఫిక్షన్‌ కథనే ఎంచుకున్నాడు. సినిమా ఫస్టాఫ్‌లో ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పుకుంటే వెళ్ళిపోయాడు. హీరో నానిని ఓ దర్శకుడిగా మంచి సినిమా తీసే ఒక అప్ కమింగ్ డైరెక్టర్‌గా చూపించారు. తన మొదటి సినిమా రాసే క్రమంలో గతజన్మలో నానికి తన ఆలోచనలు గుర్తుకు వస్తాయి. గత జన్మలో తాను ఏవైతే కథలు రాసుకున్నాడో…ప్రస్తుతం అవే కథాంశాలతో సినిమా తీసి చిక్కుల్లో పడతాడు. ఈ కథాంశాన్నితెరపై చూపడంలో డైరెక్టర్ రాహుల్ సక్సెస్ అయ్యాడు. హీరోను ఎంచుకునే విషయంలో తప్పు చేశాడేమో అనిపిస్తుంది.

సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంది. పూర్తిస్తాయిలో న్యాయం చేసింది. దేవదాసి పాత్రలో ఆమె నటన సినిమాకు ప్లస్ పాయింట్. మిగతా పాత్రలన్నీ పర్వాలేదనిపించేలా సాగాయి. మడోనా సెబాస్టియన్ నటన బాగుంది. హీరోయిన్ కృతి ఏదో అలా వచ్చింది పోయింది అనేలా ఉంది. సాంకేతికపరంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది.

భావోద్వేగభరిత సన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచిగుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఒకే ఒక్కపాట ఆ పాటలోని అర్ధం బాగుంది. మిగతా నటీనటుల నటన పర్వాలేదనిపించేలా సాగింది.

మొత్తంగా మరోసారి నాని సినిమాలో సాయి పల్లవి హైలెట్. చివరగా శామ్ సాయిపల్లవి రాయ్.

నోట్: ఇది సమీక్షుడి దృష్టి కోణంలో మాత్రమే…
రివ్యూ బై-SKG