తెలంగాణలోనూ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదా? సర్కారు పెద్దల తీరు తమిళిసైని మరింత రాటుదేలుస్తోందా? ప్రభుత్వం తన ప్రవర్తన మార్చుకోపోతే.. గవర్నరే రూట్ మారుస్తారా? తాజా పరిణామాలను చూస్తే అదే జరిగేలా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.అవునూ.. గవర్నర్ తమిళిసై ఇక వెనక్కి తగ్గేలా లేరు. రోజులు గడిచేకొద్ది అంతకంత తన టోన్ పెంచుతున్నారు. టీఆర్ఎస్ నేతల కామెంట్లకు ఇక ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య పెరిగిన ఏర్పడిన గ్యాప్ కాస్తా.. ఘర్షణకే దారితీసేలా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలోనూ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహా సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో సీఎం, గవర్నర్ల మధ్య అస్సలు పడటం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ సులువుగా ఆమోదించడం లేదు. ఇతర రాష్ట్రాల్లోలాగా చూసి చూడనట్టుగా అస్సలు వదిలేయడం లేదు. ఇకపై తెలంగాణలోనూ అదే జరిగేలా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయనందుకే ప్రభుత్వం కక్షసాధిస్తోందన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే ఫైల్ పై సంతకం చేయలేదని గవర్నర్ వివరణ కూడా ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అవమానంగా భావించింది. అది మొదలు గవర్నర్ ను తిరిగి అవమానించే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రతిగా భవిష్యత్తులో గవర్నర్ మరిన్ని కొర్రీలు పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. గవర్నర్ ను ఎంత గ్యాప్ పెంచుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికే అంత నష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుపతున్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు.

హస్తంలో ప్రశాంత్‌ తుఫాన్!!